• Neti Charithra

మానవత్వం.. చాటుకున్న.. ములకలచేరువు సి ఐ సురేష్ కుమార్ !


మానవత్వం.. చాటుకున్న.. ములకలచేరువు సి ఐ సురేష్ కుమార్ !


పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా పిటిఎం లో పోలీసులు ఓ రైతుకు ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే.. పిటిఎం మండలం

టి సదుం క్రాస్ లో ములకలచేరువు సి ఐ సురేష్ కుమార్, పిటిఎం ఎస్ ఐ సుబ్బారెడ్డి లు ఉదయం వాహనాల తనిఖీ చేస్తున్నారు. బొమ్మకపల్లె సచివాలయాని కి అదేసమయంలో అటుగా ట్రాక్టర్ ని తీసుకెళుతున్న రైతు అక్కడికి వచ్చాడు. విషయం తెలుసుకుని పోలీసులు ఆ

వాహనాన్ని వెళ్ళనిచ్చారు. అయితే ఆ ట్రాక్టర్ నడిరోడ్డు పై మొరాయించింది. దింతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీన్ని గుర్తించిన సి ఐ సురేష్ కుమార్, ఎస్ ఐ సుబ్బారెడ్డి లు తమ సిబ్బంది తో కలిసి రైతుకు చెందిన ట్రాక్టర్ ముందుకు వెళ్లేందుకు చేయి చేయి కలిపి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

411 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon