• Neti Charithra

మైనర్ బాలిక పై.. అత్యాచారం చేసిన.. గ్రామ వాలంటీర్ పై.. నిర్భయ కేసు నమోదు..!


మైనర్ బాలిక పై.. అత్యాచారం చేసిన.. గ్రామ వాలంటీర్ పై.. నిర్భయ కేసు నమోదు..!



నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు జిల్లా లో

ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువచేయాల్సిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువకుడు ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పొదలకూరు సీఐ గంగాధర్‌రావు తెలిపిన వివరాలు... మండలంలోని ఓ గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న పవన్‌కళ్యాణ్‌ అనే యువకుడు తన ఇంటి పక్కన ఉన్న బాలిక ఇంటికి

గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సెల్‌ఫోన్లో బొమ్మలు చూపిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీరుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.


506 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon