• Neti Charithra

మైనర్ బాలికలు ..పై ఐదుగురు సామూహిక అత్యాచారం !


మైనర్ బాలికలు పై ..ఐదుగురు సామూహిక అత్యాచారం !


తెలంగాణా లో

ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అయిదుగురు అత్యాచారానికి ఏడాదిగా పాల్పడుతున్న సంఘటన కామాటిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి కామాటిపురా పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన 17ఏళ్ల, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లు స్థానికంగా ఉండే ఒక పాఠశాలలో 9వ, 7వ తరగతులు చదువుతున్నారు. 17 ఏళ్ల బాలికతో ఏడాది క్రితం అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఫత్తెదర్వాజాకు చెందిన బాలుడు(16) ప్రేమ వ్యవహారం సాగించాడు. ఇద్దరూ ఒకేచోట ట్యూషన్‌కు వెళ్లేవారు. బాలికకు ప్రేమ పేరిట ఆ బాలుడు మాయమాటలు చెప్పి.. ఫత్తెదర్వాజా మార్గంలో నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేశాడు. ఇలా పలుసార్లు చేశాడు. ఈ విషయాన్ని ఆ నిందితుడు ఫత్తెదర్వాజా, పాలంరోడ్డుకు చెందిన ఇద్దరు మిత్రులు (16, 17)తో చెప్పాడు. వీరు ఇద్దరు వస్త్ర దుకాణాల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. ఈ ఇద్దరూ కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నిందితుల ద్వారా సమాచారం అందుకున్న ఫత్తెదర్వాజాలో తాళాలు బాగుచేసే దూద్‌బౌలి జమాల్‌బీ తకీయాకు చెందిన నిందితుడు మహ్మద్‌ షఫీక్‌(20), అతని మిత్రుడు ఫత్తెదర్వాజకు చెందిన విద్యార్థి మహ్మద్‌ సైఫ్‌అలీ(19).. ఆ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు సైఫ్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు.. బాలిక చెల్లెల్ని ప్రేమ పేరుతో పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ బాధిత బాలికల తండ్రి చనిపోవడంతో వారి బాగోగులు మేనమామ చూస్తున్నాడు. బాలికలు కొంతకాలంగా ఇంటికి ఆలస్యంగా రావడంతో మేనమామకు అనుమానం వచ్చి.. వారిని నిలదీశాడు. దీంతో అక్కాచెల్లెళ్లు ఏడాదిగా జరుగుతున్న అత్యాచార విషయాన్ని మేనమామకు వివరించారు. దీంతో వారి ఇద్దరిని తీసుకొని మేనమామ.. పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు మహ్మద్‌ షఫీక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతోపాటు నిందితులు ముగ్గురు మైనర్‌లను ఇన్‌స్పెక్టర్‌ జి.రాంబాబు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.135 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon