• Neti Charithra

మందు బాబులకు.. షాక్.. క్వాటర్ బాటిల్ లో కప్ప.. పార్సిల్ !


మందు బాబులకు.. షాక్.. క్వాటర్ బాటిల్ లో కప్ప.. పార్సిల్ !




చెన్నై : నేటి చరిత్ర



తమిళనాడులో ప్రభుత్వ దుకాణం నుండి మద్యం కొనుగోలు చేసిన మందుబాబుకు బాటిల్‌లో కప్ప దర్శనం ఇవ్వడం.. వైరల్ గా మారింది. మైలాదెత్తురై జిల్లా శీర్గళిలో ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణం నుండి ఒక వ్యక్తి క్వార్టర్‌ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. పొలం గట్టుకు వెళ్ళి మూత తీయగానే షాక్‌.

అందులో చనిపోయిన కప్ప ఒకటి దర్శనమిచ్చింది. సీసాలోకి కప్ప ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. మిత్రులకు విషయం చెప్పడంతో, కొందరు ఆ బాటిల్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది వైరల్ గా మారటం తో బాబోయ్.. మాకు మందు వద్దు.. అంటూ పలువురు మందు బాబులు.. గగ్గోలు పెడుతూండటం విశేషం.


306 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon