• Neti Charithra

మంత్రి ఇంట్లో.. చోరీ... రంగంలో దిగిన పోలీసులు!

#మంత్రి ఇంట్లో.. చోరీ... రంగంలో దిగిన పోలీసులు!

న్యూఢిల్లీ: నేటి చరిత్ర (సెప్టెంబర్23) న్యూఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో అక్కడి మంత్రి సత్యేందర్ జైన్ ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు పలు వస్తువులను దోచుకెళ్లారు. మంత్రి భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ‘‘సరస్వతీ విహార్ లోని నా ఇంట్లో దొంగలు పడ్డారు...భవనం అన్ని అంతస్తుల్లో దొంగలు గాలించి పలు వస్తువులను చోరీ చేశారు. దొంగలు, సంఘవ్యతిరేక శక్తులకు ఢిల్లీ పోలీసులంటే భయం లేదు’’ అని మంత్రి సత్యేందర్ జైన్ చోరీ ఘటనపై ట్వీట్ చేశారు. మంత్రి ఇల్లు ఆరు నెలలుగా తాళం వేసి ఉండటంతో చోరీ జరిగి నట్లు తెలుస్తోంది. మంత్రి ఇంట్లోని బెడ్ రూం, కిచెన్ లలో పలు వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని ఢిల్లీ డీసీపీ కోన్ చెప్పారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon