• Neti Charithra

మూడు రాజధానుల పై ప్రతి పక్షాలు నోరు విప్పాలి- స్పీకర్ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం: నేటి చరిత్ర (డిసెంబర్27)

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్ష పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని సభాపతి తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ఆక్షేపించారు. తెదేపాకు ఉన్న 23మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో భూములు ఎవరెవరికి ఉన్నాయో శాసనసభలో బహిర్గతం చేశామని సభాపతి అన్నారు.

17 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon