• Neti Charithra

మూడు రాజధానులు నిర్ణయం పై.. మండిపడ్డ - టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్..!


మూడు రాజధానులు నిర్ణయం పై.. మండిపడ్డ - టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


వైకాపా ప్రభుత్వ పాలకులకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ ని రద్దు చేసి మూడు రాజధానుల పై ప్రజా తీర్పు కోరాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి యస్ ఎమ్ పర్వీన్ తాజ్ డిమాండ్ చేశారు.మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైసీపీ కి ఐదు సంవత్సరాలు పాలించమని అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా

వ్యవహరిస్తాం అంటే కుదరదని హెచ్చరించారు.ఎన్నికల ముందు అమరావతి కిసై అంటూ ఎన్నికల అవసరాలు తీరాక నై అంటూ దొంగ చాటుగా దొడ్డిదారిన రాజధానిని విశాఖకు తరలించాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందని, రాష్ట్రాన్నీ మూడు ముక్కలు చేసే హక్కు వైసీపీకి ఎక్కడుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిపిస్టో అంటే భగవత్ గీత, భైబిల్, ఖురాన్,అని చెప్పడం కాదు చెప్పింది చేతుల్లో చూపించి అమరావతి ని రాష్ట్రానికి ఏకైక రాజధాని గా కొనసాగించి తమ విశ్వసనీయత ను నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్టి నుంచి ప్రతిపక్ష నాయకుల పైన అమరావతి కి భూములు ఇచ్చిన రైతుల పైన కక్ష సాదియింపు చర్యలకు దిగడం

దారుణమన్నారు.ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వ పెద్దలు రాజకీయ కక్షలు వీడి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆమె కోరారు.అలా కాని పక్షములో మా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అమరావతి రాజధాని విషయం పై టిడిపి ఎమ్మెల్యే లు అందరు రాజీనామా చేస్తారు దమ్ము ధైర్యం ఉంటే 48 గంటల లోగా అసెంబ్లీ ని రద్దు చేసి మూడు రాజధానుల పై ప్రజా తీర్పు కోరాలని వైకాపా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు డేరంగుల నారాయణ, కిట్టన్న, సుకుమార్, రెడ్డెన్న,సిద్ధప్ప,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


211 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon