• Neti Charithra

మూడు రాజధానులతోనే రాయలసీమకు భవిష్యత్తు : MLA నవాజ్ బాషా

మదనపల్లె: నేటి చరిత్ర (జనవరి11) ఏపీ లో మూడు రాజధానులు ఏర్పాటు ను స్వాగతిస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె లో శనివారం వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆద్వర్యం లో ఆయన నివాసం నుంచి ర్యాలీ బెంగుళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు కొనసాగింది. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ 13 జిల్లాల అభివృద్ధి కి సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో ఉన్నారన్నారు.

గతం లో ఓకే చోట అభివృద్ధి పేరుతొ హైదరాబాదు ను అభివృద్ధి చేయటం తో రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లా లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పరిస్తితి పునరావృతం కాకుండా ఏపీ ని సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాష్ట్రాలకు మొగ్గు చూపటం అభినందనీయం అన్నారు. ఈ నిర్ణయంతో భవిషత్తు లో రాయల సీమ జిల్లా లకు ఎన్నో ప్రయోజనాలు కలుగ నున్నాయన్నారు. కార్యక్రమాల్లో వైసీపీ నేతలు శమీమ్ అస్లాం, జింకా చలపతి, ఎన్ మస్తాన్ ఖాన్, అలీఖాన్, ఖజా, ఎస్ ఏ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

172 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon