• Neti Charithra

మిట్స్ కళాశాల లో మెగా రక్తదాన శిబిరం.. 200 మంది విద్యార్థులు హాజరు!

#మిట్స్ కళాశాల లో మెగా రక్తదాన శిబిరం.. 200 మంది విద్యార్థులు హాజరు!

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్26) చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి (మిట్స్) కళాశాల నందు ఎన్ఎస్ఎస్ (NSS) విభాగం వారు మదనపల్లె రోటరీ క్లబ్ మరియు బెంగళూరు లోని రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆద్వర్యం లో రక్త దాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల విద్యార్థులు సుమారు 200 మంది రక్తం ను దానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే కాదు, ఎవరు దానం చేస్తున్నారో వారికి కూడా ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి అని అన్నారు. మన రక్తంలో ప్రాణాలను కాపాడే అంశాలు అనేకముగా ఉన్నాయి అని, వివిధ వ్యాధులు మరియు గాయాల చికిత్సకు తోడ్పడతాయి అని అన్నారు. రక్తదానం చేయటం వలన ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్నాము అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని విద్యార్థుల తో అన్నారు. 18 -60 వయస్సు ఉండి,50కి.ల పైన బరువు ఉన్న ప్రతి ఒక్కరు 450 మీ.లీ వరకు రక్తం దానం చేయవచ్చు అని, పురుషులు 3 నెలలకొకసారి మరియు స్త్రీలు 4 నెలలకొక్కసారి చేయవొచ్చు అని అన్నారు. రెగ్యులర్ వ్యవధిలో రక్తదానం చేయటం వలన శరీరంలో ఇనుము యొక్క శాతం క్రమబద్ధం చేయబడుతుంది మరియు గుండెపోటు నుండి దూరంగా ఉంచుతుంది అని అన్నారు. రక్తం దానం వలన ఒక వ్యక్తి జీవితం రక్షింపబడటం మాత్రమే కాదు, దీనివలన దాత శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది అని అన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి అని విద్యార్థులతో అన్నారు. అంటువ్యాధులు, హెచ్.ఐ.వి, క్యాన్సర్, మధుమేహం, క్షయ, ఉబ్బసం, రేబీస్ వంటి రోగ హస్తులు రక్త దానం చేయకూడదని అన్నారు. ఉదయం 10 గంటల నుండి కలశాలలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ శిభిరం లో పాల్గొనడం ఆనందంగా ఉందని, రక్త దానం లో పాల్గొన్న విద్యార్థులకు ఆపిల్ మరియు ఫల్లరసం ను అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమం లో ఎన్ఎస్ఎస్ (NSS) కోఆర్డినేటర్ నరసింహ, విద్యార్థులతో పాటు, మదనపల్లె రోటరీ క్లబ్ మెంబెర్స్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon