• Neti Charithra

మిట్స్ కళాశాల లో జాతీయ క్రీడా దినోత్సవం

#మిట్స్ కళాశాల లో జాతీయ క్రీడా దినోత్సవం

మదనపల్లె: నేటి చరిత్ర ( ఆగస్టు30) చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు జాతీయ క్రీడా దినోత్సవం ను పురస్కరించుకొని కళాశాల నందు రెండు రోజుల పాటుగా నిర్వహిస్తున్న క్రీడలలో విజేతలకు బహుమతులను అందజేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా కళాశాలలోని విద్యార్థులకు నిర్వహించిన వాలీబాల్ మరియు హ్యాండ్ బాల్ పోటీలని విభాగాల వారీగా నిర్వహించారు. పురుషుల బాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలలో మెకానికల్ రంగం వారు విజేతలుగా నిలిచారని, స్త్రీ లకు నిర్వహించిన పోటీలలో సివిల్ విభాగపు విద్యార్థినిలు గెలుపొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్య లోనే కాకుండా ఫిట్నెస్ ఆక్టివిటీస్ మరియు స్పోర్ట్స్ లో కూడా పాల్గొని, ఆరోగ్యముగా ఉండాలని ఆయన అన్నారు. మనదేశం లో ఎంతో మంది క్రీడాకారులు, యెన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. విద్యార్థులు ఒక స్పోర్ట్స్ పై మక్కువ కలిగి ఉంటె దానిమీదనే రాణించి విజయం పొందాలని, ఓటమిని కూడా సులువుగా స్వీకరించగలిగితే, విజయం సాధించుటకు ఆస్కారం మరింత ఎక్కువ గా ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులు ప్రతి రోజు వ్యాయామాలు చేయాలనీ, క్రమం తప్పకుండ యోగ మరియు ఇతర వ్యాయామాలు చేస్తే గుండె జబ్బులు, బి.పీ మరియు ఇతర జబ్బుల నుండి కూడా విముక్తి పొందవచ్చని అన్నారు. విద్యార్థులు ఈ విధంగా చేయగలికితే, చదువు పై ఎక్కువ శ్రద్ధ వహించవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వము కూడా ప్రజల పరిపూర్ణ ఆర్గ్యం కోసం ఫిట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భాంగా నిర్వహించిన క్రీడలలోని విజేతలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. హంపమ్మ బహుమతులని అందజేశారు. కార్యక్రమం లో కళాశాల డీన్ శ్రీమంత బసు, సీనియర్ ఫిసికల్ డైరెక్టర్ వెంకట రమణ, ఫిసికల్ డైరెక్టర్ రాజేష్ విల్లియమ్స్, విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.