• Neti Charithra

మిట్స్ కళాశాల కు ''బెస్ట్ ఇంజనీరింగ్ ఇనిస్టూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్' అవార్డు!

#మిట్స్ కళాశాల కు ''బెస్ట్ ఇంజనీరింగ్ ఇనిస్టూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్' అవార్డు!

మదనపల్లె:నేటి చరిత్ర (సెప్టెంబర్25) చిత్తూరు జిల్లా మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె (మిట్స్ ఇంజనీరింగ్) కళాశాల నందు ఇన్నోవేషన్ సెంటర్ వారు మొదటి వార్షిక దినోత్సవాన్ని కళాశాల నందు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ కళాశాల లోని ఇన్నోవేషన్ సెంటర్ వారు ఈ సంవత్సర కాలం లోనే అనేక విజయాలను విద్యార్థులు సాధించేలా కృషిచేశారని ఆయన అన్నారు. స్థాపించిన సంవస్తరం లోనే జాతీయ స్థాయీ లో విద్యార్థులు గుర్తింపు పొందేలా ఏ.ఐ.సి.టి.ఈ స్మార్ట్ ఇండియా హ్యకథన్ పోటీలలో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ఎడిషన్ రెండు విభాగాలలోను విద్యార్థులు విజేతలుగా నిలిచి ప్రతిభ కనపరిచారని ఆయన అన్నారు. కళాశాలకు "బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్" అవార్డు ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్సు డెవలప్మెంట్ (MHRD) ఇన్నోవేషన్ సెల్ వారు అందజేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా తీర్చుటకు ఈ సెంటర్ వారు కృషిచేయడం ఆనందంగా ఉందని, నూతన సాంకేతిక ఆలోచనలను అమలు చేయుటకు కూడా ఎన్నో కార్యక్రమాలను విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం మంచి విషయం అన్నారు. విద్యార్థులు నూతన టెక్నాలజీ పై దృష్టి సారించి మంచి పరిశోధనలు చేయాలనీ అన్నారు. విద్యార్థులు టెక్నాలజీ పరంగా ర్రోజురోజుకు ఎదగాలని, దేశానికి ఉపయోగాయపడే నూతన ఆవిష్కరణలను కనుగొనాలని విద్యార్థులతో అన్నారు. ఇన్నోవేషన్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమం లో అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్, డీన్ ప్రహ్లదరావు, కోఆర్డినేటర్ డాక్టర్ జగదీశ్ బాబు, చొక్కనాదం, రహీమ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon