• Neti Charithra

మిట్స్ ఆద్వర్యం లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

#మిట్స్ ఆద్వర్యం లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

కురబలకోట: నేటి చరిత్ర (సెప్టెంబర్7) చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల వారు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో మిట్స్ కలశాలకు చెందిన వైస్ ప్రిన్సిపాల్ అడ్మిషన్స్ డాక్టర్ జి.సదాశివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ విద్య ఎంతో ముఖ్యం అని, విద్యతో దేనినైనా సాధించవచ్చు అని అన్నారు. ఆయన మాట్లాడుతూ మనుషులోని అజ్హ్యనాన్ని, పేదరికాన్ని పారదోలేదే చదువే అని, విద్యకు పేద, ధనిక, వర్గ బేధం లేదన్నారు. పంచేకొద్దీ తరిగేది ధనం అయితే పంచేకొద్దీ పెరిగేది విద్య అని అన్నారు. చదువు చాల విలువైనది అని, చదువుతో జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పుతుంది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ అక్షర భాష్యం అందిస్తోన్నది అని దీన్ని ప్రతి ఒక విద్యార్థి ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అడ్మిషన్స్ డాక్టర్ జి.సదాశివ ప్రసాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలితా కుమారి, ఎన్ఎస్ఎస్ (NSS) కోఆర్డినేటర్ నరసింహ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon