• Neti Charithra

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. శ్రీకాకుళం లో ఉద్రిక్తత!


మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. శ్రీకాకుళం లో ఉద్రిక్తత!



శ్రీకాకుళం : నేటి చరిత్ర



టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడుని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడం తో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో ఆయన నివాసానికి నేటి తెల్లవారుఝామున చేరుకున్న ఎసిబి అధికారులు అచ్చెనాయుడిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. 100 మంది పోలీసు భద్రత మధ్య విజయవాడకు తరలించారు. ఇఎస్‌ఐ మందుల

కుంభకోణంలో ఎసిబి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.. ఎపి ఇఎస్‌ఐలో రూ.150 కోట్ల స్కామ్‌ జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడితో పాటు మరో మాజీ మంత్రి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొనుగోళ్ల టెండరింగ్‌లో మాజీ మంత్రి కుమారుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. రూ.988 కోట్ల మందులు,

పరికరాలు, ల్యాబ్‌ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను అరెస్ట్‌ చేసిన ఎసిబి అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెనాయుడిని అదుపులోకి తీసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

198 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon