• Neti Charithra

మాజీ మంత్రి అచ్చెన్నా యుడు కు హైకోర్టు బెయిల్.. టీడీపీ లో సంబరాలు..!



మాజీ మంత్రి అచ్చెన్నా యుడు కు హైకోర్టు బెయిల్.. టీడీపీ లో సంబరాలు..!



అమరావతి: నేటి చరిత్ర


మాజీ మంత్రి టీడీపీ నేత

టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో

అవకతవకలకు సంబంధించిన  కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుణ్ని నిమ్మాడలోని తన నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు.  అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో శ్రీకాకుళం లో

టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


187 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon