• Neti Charithra

మహిళా పోలీస్ కు... హ్యాట్సాప్.. చెప్పిన మెగాస్టార్ చిరంజీవి!


మహిళా పోలీస్ కు... హ్యాట్సాప్.. చెప్పిన మెగాస్టార్ చిరంజీవి!
హైదరాబాద్: నేటి చరిత్ర


ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఓ మహిళా పోలీస్ అధికారిణి ని ప్రత్యేకంగా అభినదించడం సామాజిక మాధ్యాలలో విస్తృత ప్రచారం జరుగు తోంది.

వివరాల లోకి వెళితే..

మాతృదినోత్స‌వం రోజున మ‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులో శుభ‌శ్రీ అనే లేడీ పోలీస్ ఆఫీస‌ర్ ఓ మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌కు అన్నం తినిపిస్తున్నారు. పోలీసులంటే క‌రుడుగ‌ట్టిన‌వారు కాదు.. వారిలో క‌రుణ కూడా ఉంటుంద‌ని తెలియ‌జేసేలా ఆ వీడియో ఉంద‌ని చిరు తెలిపారు. అలాగే తాను స‌ద‌రు పోలీస్ ఆఫీస‌ర్‌తో మాట్లాడాన‌ని ఆ వీడియో త్వ‌ర‌లోనే పోస్ట్ చేస్తాన‌ని కూడా అన్నారు. కొద్దిసేప‌టి క్రితం చిరంజీవి ఆ మ‌హిళా పోలీసాఫీస‌ర్ శుభ‌శ్రీతో మాట్లాడిన సంభాష‌ణ వీడియో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.(ఓ మహిళా పోలీస్ ను అభినందిస్తూ న్న మెగా హీరో చిరంజీవి) విజువల్స్ మీ కోసం

!


చిరంజీవి:  గుడ్ మార్నింగ్ శుభశ్రీ జీ

శుభ‌శ్రీ:  న‌మ‌స్తే సార్‌

చిరంజీవి:  న‌మ‌స్తే శుభ‌శ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒక‌టి నా దృష్టికి వ‌చ్చింది. ఓ మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌కు అన్నం తినిపిస్తున్నారు. ఆ వీడియో నా మ‌న‌సుని చ‌లింప చేసింది. ఆరోజు నుండి నేను మీతో మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను. మీరంత మాన‌వీయంగా ఉండ‌టం చూసి సంతోష‌మేసింది. మీరంత బాధ్య‌తగా ఉండ‌టానికి కార‌ణ‌మేంటి?

శుభ‌శ్రీ:  నేను ఆ మ‌హిళ కోసం ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. నేను భోజనం అందించేట‌ప్పుడు ఆమె తినే స్థితిలో లేరు. ఆమె మాన‌సిక వైక‌ల్యంతో పాటు అంగ వైక‌ల్యంతోనూ బాధ‌ప‌డుతున్నారు. అందువ‌ల్ల నేనే ఆమెకు తినిపించాను.

చిరంజీవి:  మీలో నేను గొప్ప త‌ల్లి హృద‌యాన్ని చూశాను.

శుభ‌శ్రీ:  థాంక్యూ సార్‌

చిరంజీవి:  మీరు చాలా మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. మిమ్మ‌ల్ని చాలా మంది అభినందించి ఉంటారుగా

శుభ‌శ్రీ:  అవును సార్‌.. మా ముఖ్య‌మంత్రిగారు ఈ వీడియో ట్వీట్ చేశారు. అలాగే బాధ్య‌త అంటే లా అండ్ ఆర్డ‌ర్‌ను కాపాడ‌ట‌మే కాదు.. పౌరుల‌కు ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చిన స‌హ‌య‌ప‌డ‌టం మ‌న క‌ర్త‌వ్యం. అదే విష‌యాన్ని మా ఏడీజీపీ అరుణ్ స‌లోంజిగారు చెబుతుంటారు.  దాన్నే నేను పాటించాను. ఈరోజు మీరు నాతో మాట్లాడం ఉద్వేగంగా అనిపిస్తుంది. ఆనంద్‌గారు మీరు మాట్లాడాల‌నుకుంటున్నార‌ని చెప్ప‌గానే నేనెంతో ఉత్తేజం పొందాను. మీరు మెగాస్టార్ మాత్ర‌మే కాదు. గొప్పగా సమాజానికి సేవ చేస్తున్నారు. మీరు చేసిన ఎన్నో కార్య‌క్ర‌మాలు, సెమినార్లు చూశాను. మీరు టూరిజంలో చేసిన డెవ‌ల‌ప్‌మెంట్స్ నాకు తెలుసు. మీ వ్య‌క్తిత్వం ఎంతో ఇష్టం.

చిరంజీవి:  థాంక్యూ అమ్మ‌.. మీతో మాట్లాడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మీరులాగే ముందుకు సాగాల‌ని కోరుకుంటున్నాను.

శుభ‌శ్రీ:  మీ ఆశీర్వాదానికి ధ‌న్య‌వాదాలు.
172 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon