• Neti Charithra

మహిళా కార్పొరేటర్ పై అత్యాచారం.. బిజెపి మాజీ ఎమ్మెల్లే పై కేసు నమోదు !






మహిళా కార్పొరేటర్ పై అత్యాచారం.. బిజెపి మాజీ ఎమ్మెల్లే పై కేసు నమోదు !


ముంబ‌యి : నేటి చరిత్ర (ఫిబ్రవరి29)



బిజెపి మాజీ ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఓ మహిళా మున్సిపల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబై నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళా మున్సిపల్ కార్పొరేటర్ మీరారోడ్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళా కార్పొరేటర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాలు కలిసి అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. పోలీసులు నరేంద్ర మెహతాపై ఐపీసీ సెక్షన్ 376(2), 496, 417, 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నరేంద్ర మెహతా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.



20 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon