• Neti Charithra

మహిళల అభివృద్ధి కి ప్రభుత్వం పెద్దపీట- ఎమ్మెల్యే నవాజ్ బాషా

#మహిళల అభివృద్ధి కి ప్రభుత్వం పెద్దపీట- ఎమ్మెల్యే నవాజ్ బాషా

మదనపల్లె: నేటి చరిత్ర (అక్టోబర్1) మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం జరిగిన పోషణ మాసోత్స వాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాల మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు దాదాపు గా మహిళల పేరుతోనే ప్రభుత్వం అందిస్తోందన్నారు. మహిళలు భవిషత్తు లోను వైసీపీ కి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీడీపీవో సుజాత మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు సహజంగా లభించే చిరు ధాన్యాల ఆహార పదార్థాలను వినియోగించాలన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon