• Neti Charithra

మనీషా.. నిదితులను శిక్షించాలని మదనపల్లె లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ..!


మనీషా.. నిదితులను శిక్షించాలని మదనపల్లె లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ..!




మదనపల్లె: నేటి చరిత్ర



ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హత్రాస్ జిల్లాలో నలుగురు అగ్రకుల మానవ మృగాల చేతుల్లో అత్యాచారం కాబడి, నాలుక్కోసి చంపబడ్డ దళిత బిడ్డ మనీషా వాల్మీకి కి మదనపల్లె టౌన్, రామారావు కాలనీ MRPS ఇంచార్జి మేస్త్రి రమణ, పట్టుగూళ్ల రమణ ల ఆధ్వర్యంలో..... మనీషా చిత్రపటానికి పూలు జల్లి కొవ్వొత్తుల ర్యాలీ చేసి నివాళులు అర్పించారు....

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి


యస్.నరేంద్ర బాబు మాదిగ, టౌన్ అధ్యక్షులు Y.రాజా లు మాట్లాడుతూ

అగ్రకుల మానవ మృగాలు మానవత్వం నశించి, అత్యాచారం చేయడమే కాకుండా, నాలుక్కోసి, గొంతినులిపి, పైశాచికంగా చంపేసిన దుండగులను ఉరి తీయాలని, అదేవిధంగా వారిని కాపాడుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా హాస్పిటల్ లో చనిపోయిన మనీషా మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా , పోలీసులే అర్ధరాత్రి పూట దహనం చేయడం వెనుక ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం కుట్ర వున్నదని , ఒక క్షణం కూడా ముఖ్యమంత్రి సీట్ లో కూర్చునే హక్కు యోగికి లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో MRPS పట్టణ అధ్యక్షులు రాజా, పట్టణ నాయకులు పట్టుగూళ్ళు రమణ, రవి, మేస్త్రి రమణ, గంగులప్ప, నాగరాజ్ , హరి, రెడ్డి శేఖర్, గంగాధర్,టెజేశ్వర్, M.శ్రీను, శశి , టి.రమణ, నరేసింహులు, హేమంత్, గడ్డం రమణ, MRPS కాలనీ కార్యకర్తలు పాల్గొన్నారు.



115 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon