• Neti Charithra

మద్యం.. మత్తు... ఆ పై.. అతి వేగం... మూడు .. కుటుంబాల్లో.. విషాదం.. మిగిల్చింది !

మద్యం.. మత్తు.. ఆ పై అతి వేగం.. మూడు కుటుంబాల్లో విషాదం.. మిగిల్చింది !

హైదరాబాద్: నేటి చరిత్ర (ఫిబ్రవరి23)

ముందే.. మద్యం.. మత్తు.. ఆ పై అతివేగం.. ఫలితం.. మూడు జీవితాలను చిదిమేసిన ఘటన హైదరాబాదు లో చోటు చేసుకొంది.

మద్యం మత్తులో ఉన్న యువకులు మితిమీరిన వేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ... కర్మన్‌ ఘాట్ చౌరస్తా సమీపంలో ఓ చెట్టును ఢీ కొన్నారు. అనంతరం కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ మెస్ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతినగా... ఎయిర్ బెలూన్స్ సైతం పగిలిపోవటం గమనార్హం. అర్ధరాత్రి 2 నుంచి 3గంటల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెనుక సీట్లో ఉన్న మరో యువకుడు సీటు బెల్టు పెట్టుకోవటంతో ప్రాణాపాయం తప్పి...గాయాలతో బయటపడ్డాడు. చనిపోయిన ముగ్గురు చంపాపేట్ కి చెందిన సాయినాథ్ , మల్లికార్జున్, సాయిరామ్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడు కళ్యాణ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

55 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon