• Neti Charithra

మదనపల్లె సబ్ డివిజన్ లో క్షయ వ్యాధి గ్రస్తులందరికీ.. ఉచితంగా కరోనా పరీక్షలు- వైద్య శాఖ అధికారులు..!


మదనపల్లె సబ్ డివిజన్ లో క్షయ వ్యాధి గ్రస్తులందరికీ.. ఉచితంగా కరోనా పరీక్షలు- వైద్య శాఖ అధికారులు..!



మదనపల్లె:నేటి చరిత్ర



కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ ఏపీ అధికారుల ఆదేశాలు మేరకు.. చిత్తూరు జిల్లామదనపల్లి డివిజన్ పరిధి లో

మొదటి దశలో టిబి నిర్దారిత పేషెంట్ లకు అందరికి కరోనా పరీక్షలు అన్ని ప్రభుత్వ

ఆసుపత్రులలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు

జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్

డా. రామూర్తి నాయక్ మరియు డిప్యూటీ

డీఎం&ఎచ్ ఓ డా. లోకవర్ధన్ లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పిపి యూనిట్ వైద్యధికారిని డా.అనుపమ మాట్లాడుతు మదనపల్లి అర్బన్ ఏరియా పరిది లో

మార్చి 1 2020 నుంచి ఇప్పటివరకు 102 టిబి కేసులకు టిబి యూనిట్ ఆధ్వర్యంలో గుర్తించామన్నారు. అని వీరందిరికి జిల్లా ఆసుపత్రి నందు శనివారం మరియు సోమవారం మరియు మంగళవారం కోవిడ్ పరీక్షలు చేయడం జరుగుతుంది అని



అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రామూర్తి నాయక్ మాట్లాడుతు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ఆ దేశాలు మేరకు కోవిడ్ బారిన పడిన పేషెంట్ లకు కోవిడ్ వైరస్ ఊపిరితిత్తుల మీద అధిక ప్రభావం చూపి వ్యాధి ముదిరి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. కావున టిబి ల మరియు కరోనా లక్షణాలు రెండు ఒకే

విధమైన లక్షణాలు కలిగి ఉండడం వలన అన్ని కోవిడ్ నిర్దిరిత పేషెంట్ లకు టిబి పరీక్షలు మరియు టిబి నిర్దారీత పేషెంట్ లకు కోవిడ్ పరీక్షలు అన్ని ప్రభుత్వ

ఆస్పత్రు లలో రాపిడ్ యాంటీజన్

కిట్ ల తో ఉచితముగా పరీక్షలు చేయడం జరుగుతుంది అని , మొదటగా 1/3/2020 నుంచి 31/8/20 వరకు టీబి మందులు వాడుతున్న ప్రతి ఒక్క పేషెంట్ కు అన్ని ప్రభుత్వ ఆశుపత్రిలలో 5/9/2020 నుంచి 12/9/2020 వరకు ఉచితముగా కోవిడ్ పరీక్షలు చేస్తారు అని , ఇవ్వని టిబి ట్రీట్మెంట్ కార్డ్ ల మీద నమోదు చేయడం జరుగుతుంది అని, ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డా. రమేష్ బాబు తెలిపారు. టిబి సూపర్ వైజర్ ప్రభాకర్ మాట్లాడుతు మదనపల్లి డివిజన్

లో కల మార్చి నెల నుంచి మందులు మింగుతున్న టిబి పేషెంట్ లు అందరూ కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చెపించుకోవాలని ఇందులకు అందరూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి డాక్టర్ లు డా. ఫహీం నవాజ్, డా.లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, హెడ్ నర్స్ వరలక్ష్మి , మదనపల్లి టిబి యూనిట్ సిబ్బంది ప్రభాకర్, దయాలన్, జగదీశ్వరి, సుశీల, జిల్లా ఆసుపత్రి స్టాఫ్ నర్స్ లు , కోవిడ్ సిబ్బంది పాల్గొన్నారు.


131 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon