• Neti Charithra

మదనపల్లె లో స్పందనకు.. భారీగా అర్జీలు!

#మదనపల్లె లో స్పందనకు.. భారీగా అర్జీలు!

మదనపల్లి: నేటి చరిత్ర (డిసెంబర్16) చిత్తూరు జిల్లా మదనపల్లె లో సోమవారం స్పందన కార్యక్రమ అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా డివిజన్ పరిదిలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో ప్రజలు వచ్చి ఆ సమస్యల ఆర్జిలను నేరుగా సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి కు అందజేశారు. అర్జీదారులు, పెన్షన్లు, ఇంటి పట్టాలు, భూ సర్వే, భూ సమస్యలు, గృహాల మంజూరు, విద్యుత్, త్రాగునీటి సమస్యలు, హంద్రి నీవ సుజల స్రవంతికి(హెచ్.ఎన్.ఎస్), నేషనల్ హైవే(ఎన్.హెచ్) కి, భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, పట్టాదారు పాసు పుస్తకాలు, ఈ పాస్ పుస్తకాలు, భూములు ఆన్ లైన్ చేయించాలని,1బి పట్టాలు, గృహాలకు స్థలం మంజూరు చేయాలని, దారి సమస్య, కలెక్టర్ కార్యాలయం కోర్టు లో పెండింగ్ లో ఉన్న భూ సంబంధ కేసులు వంటి సమస్యలకు సంబందించి 82 మంది అర్జీదారులు అందజేసిన అర్జిలను సబ్ కలెక్టర్ గారు పరిశీలించి సంబందిత శాఖలకు పంపించి సమస్య పరిష్కారం అయ్యే విదంగా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గారికి అర్జీదారులకు సూచించారు.

1. వాల్మీకిపురం మండలం, కూరపర్తి గ్రామంలో ఇంటి నిర్మాణాల అవసరాల కోసం ఇసుకను తోలుకోవడానికి పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వడం లేదని, కొందరికి మాత్రమే సాండ్ వే బిల్ ద్వారా అనుమతులు ఇచ్చారని, ఒకే బిల్ తో ఎక్కువ లోడు ఇసుకను తీసుకుని వెళుతున్నారని , మేము డబ్బులు కడుతాం సాండ్ వే బిల్ ఇవ్వడం లేదని కనుక ఈ సమస్యపై స్పందించి విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జిని సబ్ కలెక్టర్ గారికి సమర్పించారు.

2. AEGIS కో ఆపరేటివ్ సొసైటీలో ఏజంట్ల ద్వారా చాలామంది ప్రజలు డిపాజిట్లు చేయడం జరిగిందని ఎం డి.శ్రీనివాసులు డిపాజిట్ల మొత్తం ను దుర్వినియోగం చేసారని, డిపాజిట్ దారులైన మాకు అతని ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం చేయాలని AEGIS లో చేరిన సభ్యులు అర్జిని సబ్ కలెక్టర్ గారికి అందజేశారు. 3. పెద్దమండ్యం మండలం, కలిచెర్ల పంచాయతి, ఎర్రగుట్ట పల్లె గ్రామస్తులు పూర్వకాలం నుండి మా అధినంలో ఉన్న డి కే టి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని, ఐతే మా గ్రామానికి చెందిన కొందరు ఆ భూములకు సంబంధించి డి కే టి భూమికి నకిలీ సంతకాలతో పట్టాలు చేయించుకున్నారని మాకు అన్యాయం జరిగిందని దీనిపై విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ని సబ్ కలెక్టర్ గారికి అందజేశారు. 4. పెద్దమండ్యం మండలం, కలిచెర్ల పంచాయతి, ఎర్రగుట్ట పల్లె గ్రామస్తులు పి.పుల్లారెడ్డి, తండ్రి వెంకటరెడ్డి అనే అతను ప్రైవేటు సర్వేయరుగా కొనసాగుతూ పలు ఆక్రమణలు చేస్తున్నాడని, ఇతరుల అనుభవంలో ఉన్న భూములను ఇతను పేరు మిద పట్టాలు నమోదు చేసుకుంటున్నాడని, భూ సర్వే పనులకు ఎకరానికి రూ.10 వేలు వసూలు చేస్తున్నాడని కొండలకు, గుట్టలకు పట్టాలు ఇప్పించి డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఇతని వద్ద రెవిన్యూ కు సంబంధించి అడంగల్ -1 బి ల్యాండ్ మ్యాప్ లు అన్ని డాక్యుమెంట్ లు ఉన్నాయని, ఇతని కుటుంబ సభ్యులు అందరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయని, మండలంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని పట్టాలు ఇప్పించుట , ఆన్ లైన్ పనులు ఇలా ఎన్నో అక్రమాలు చేస్తూ ప్రజల డబ్బులు వసూలు చేస్తున్నాడని కావున దయఉంచి మాకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు వెంకట్రెడ్డి, చిన్నప్ప రెడ్డి అర్జీని సబ్ కలెక్టర్ గారికి అందజేశారు. 5. రామసముద్రం మండలం, పెద్దకురవపల్లి పంచాయతీ, తిరుమల రెడ్డి గ్రామానికి చెందిన చిన్న తిమ్మప్ప 2017 వ సంవత్సరం లో నా భార్య ఆదిలక్ష్మి పొలం దగ్గర పశువులు మేపుతుండగా పిడుగు పడి మరణించడం జరిగిందని, చంద్రన్న భీమా ద్వారా ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 5 లక్షలు ను సంబందిత అధికారులు రూ. 70 వేలు అందజేయడం జరిగిందని మిగిలిన పైకం మంజూరు చేయలేదని ఎన్ని సార్లు అధికారుల వద్దకు వెళ్ళినను చిత్తూరు లో ఉన్న కాల్ సెంటర్ కు పంపడం జరిగిందని, ఇక్కడ ఉన్న అధికారులు చెపుతున్నారని, చిత్తూరుకు వెళ్లి కాల్ సెంటర్లో విచారించగా పంపుతామని చేపుతున్నారు. కానీ రెండు సంవత్సరాలు అవుతున్నను మాకు న్యాయం జరగలేదని దీనిపై విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీని సబ్ కలెక్టర్ గారికి సమర్పించారు. పై సమస్యలకు సమబందించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ గారు అర్జిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ షమ్షీర్ ఖాన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మునికృష్ణయ్య, సిడిపి ఓ సుజాత, వెలుగు కొ ఆర్డినేటర్ వాణిశ్రీ, గృహనిర్మాణ శాఖ డి ఈ చంద్ర శేఖర్, డ్వామా పుష్పావతి, జలవనరుల శాఖ ఎ. ఈ. స్వర్ణలత, విద్యుత్ శాఖ ఎ .ఈ.లలిత, మునిసిపల్ శాఖ జూనియర్ సహాయకులు రత్నమ్మ, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon