• Neti Charithra

మదనపల్లె లో యాచకులకు జీవనోపాధి చూపుతున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ !


మదనపల్లె లో యాచకులకు జీవనోపాధి చూపుతున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ !



(మదనపల్లె లో యాచకులకు వెయిట్ మిషన్ పంపిణీ చేస్తున్న హెల్పింగ్ మైండ్స్)



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో నిత్యం సమాజ సేవలో ఉంటూ మదనపల్లి లో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ.మరో సరికొత్త అలోచన కు శ్రీకారం చుట్టింది.మదనపల్లి లో యాచిస్తూ జీవనం సాగిస్తున్న యాచకులకు వెయిట్ మిషన్స్ ఉచితంగా అందజేసి వారికి సొంత ఉపాధిని కల్పించింది. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరైనా ధర్మం చేస్తూనే పొట్ట నింపుకునే యాచకుల కొరకు సొంత జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనే ఆలోచన

తో వారికి వెయిట్ మిషన్ & మ్యాట్ (కాళ్లు తుడుచుకోవడానికి ) ఉచితంగా అందజేశామని, తమ బరువులు చూసుకొని తమకు తోచిన సహాయం యాచకులకు చేయాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మధు,నవీన్,చందు పాల్గొన్నారు


91 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon