• Neti Charithra

మదనపల్లె లో మళ్ళీ.. విజృంభించి న కరోనా.. రెండు గ్రామాల లో భయం.. భయం.. !


మదనపల్లె లో మళ్ళీ.. విజృంభించి న కరోనా.. రెండు గ్రామాల లో భయం.. భయం ..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె లో కరోనా పాజిటివ్ కేసులు 7 కు చేరాయి. ఇప్పటికే

5 కేసులు నమోదు కాగ వైద్య చికిత్సలు అనంతరం ఒకరికి నెగిటివ్ వచ్చింది. తాజాగా బుధవారం మదనపల్లి మండలం

లో మరో రెండు కరోనా పోసిటివ్ కేసులు నమోదు అయ్యాయని మదనపల్లి డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. బుధవారం 20.5.2020 డాక్టర్ లోకవర్ధన్ మదనపల్లి మండలంలోని

సి.టి.ఎమ్.పి.హెచ్.సి.పరిధిలోని మిట్టపల్లె మరియు నాయనివారి పల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామంలో ఒక్క కేసు చొప్పున వచ్చాయని తెలిపారు. గత వారం లో మిట్టపల్లె లో వచ్చిన పోసిటివ్ కేస్ యొక్క ద్వితీయ పరిఛయమేనని ,ఇతను కూడా వాహన చోదకుడని తెలిపారు. ఇతన్ని చిత్తూరు


( మదనపల్లె లో కరోనా పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నా యో వివరించిన అధికారులు)


కోవిడ్ ఆస్పత్రికి ప్రత్యేక వాహనం ద్వారా పంపుచున్నామని ,ఇతనియొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ముగ్గురిని,తిరుపతి వికృతమాల క్వారెంటైన్ కు ప్రత్యేక వాహనం ద్వారా పంపుచున్నామని,ద్వితీయ పరిచయస్థులను హోమ్ క్వారెంటైన్ లో ఉంచి వారికి కోవిడ్ టెస్టులు న8ర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా నాయనివారి పల్లి లోని మరో వ్

వ్యక్తి కూడా వాహన చోదకుడే,ఇతన్ని కూడా ప్రత్యేక వాహనం లో చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని,ఇతని ప్రైమరి కాంటాక్ట్స్ ను ప్రత్యేక వాహనం ద్వారా తిరుపతి వికృతమాల క్వారెంటైన్ కు పంపిస్తున్నామని తెలిపారు. ద్వితీయ పరిచయస్థులును హోమ్ క్వారెంటైన్ లో ఉంచడం జరుగుతుంది అన్నారు. గ్రామంలో నే స్వాబ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ఆశా కార్యకర్తల మరియు గ్రామ వాలేంటీర్ ల సహాయం తో ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు గల వారిని గుర్తించి వార్8కి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో హైపోక్లోరత్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నామని,పారిశుద్ధ్యం, రెడ్ జోన్ మ్యాపింగ్ వంటి విధులు సంబంధిత శాఖల సిబ్బంది ద్వారా నిర్వహించడం జరుగుతుంది అన్నారు.రెడ్ జోన్ పరిధిలోని రక్తపోటు, సుగర్, కాన్సర్,గుండెసంబంధ వ్యాధులు, మూర్ఛ వ్యాధి గ్రస్థులు మరియు గర్భవతులు, శిశువులు,బాలింతలు వారికి డాక్టర్ వై.ఎస్.ఆర్.టెలి మెడిసిన్ ద్వారా మందులు ఇంటివద్దకే చేరుస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో మదనపల్లి డివిజన్ డిప్యూటీ. డి.ఎమ్. హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్, సి.టి.ఎమ్.వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి, డివిజనల్ హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,పోలీస్ శాఖ వారు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

1,228 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon