• Neti Charithra

మదనపల్లె లో మద్యం మత్తులో కారు భీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం.. పరుగులు పెట్టిన జనం..!



మదనపల్లె లో మద్యం మత్తులో కారు భీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం.. పరుగులు పెట్టిన జనం..!



మదనపల్లె: నేటి చరిత్ర


మద్యం మత్తులో యువకుడు కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై వ్యక్తులు, ద్విచక్ర వాహనాల దూసుకెళ్లిన ఘటన

చిత్తూరు జిల్లామదనపల్లె లో కలకలం రేపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

(పట్టణం లో హడల్ ఎత్తించిన కారు)


మదనపల్లె పట్టణం ప్రశాంత్ నగర్ కు చెందిన డి.‌ సత్యనారాయణ మద్యం సేవించి రామారావు కాలనీ నుంచి కారు‌ వేగంగా వస్తూ గొల్లపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సలీమ్ డీ కొట్టడం జరిగింది. గాయాలపాలైన కురబలకోట

మండలానికి చెందిన సలీమ్ ను వెంటానే ఆసుపత్రికి తరలించారు. కారు ఆపకుండా వెళ్ళే క్రమంలో అదే రోడ్డులో మరికొన్ని

వాహనాలను ఢీకొన్నాడు.

ఈ ఘటన తో స్థానికులు పరుగులు పెట్టారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


1,009 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon