• Neti Charithra

మదనపల్లె లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన మదనపల్లె సబ్ కలెక్టర్ చేకూరి కిర్తి!

#మదనపల్లె లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన మదనపల్లె సబ్ కలెక్టర్ చేకూరి కిర్తి

మదనపల్లి : నేటి చరిత్ర (సెప్టెంబర్ 21) మదనపల్లి మండలం అర్బన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. శనివారం ఉదయం మదనపల్లె అర్బన్ మండలం పరిధిలో వెంకప్పకోట, బసినికొండ, వలసపల్లి, నిమ్మనపల్లి మండలం, రాచావేటివారిపల్లి, ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను తహసిల్దార్లు తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద వారందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో అర్హులైన వారికి G+3 ద్వారా గృహాలు నిర్మించేందుకు అవసరమైన భూములను అందుబాటులో ఉంచాలని అదేశించియున్నారు. మదనపల్లి అర్బన్ పరిధిలో ఇప్పటికే చాలా మంది గృహాలు మంజూరు కోసం ధరకాస్తులు సమర్పించుకొని యున్నారని, సుమారు 50 ఎకరాలు భూమి అవసరం ఉన్నందున మదనపల్లె చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూమిని, డికెటి భూమిని గుర్తించి అందుబాటులో ఉంచాలని సంబందిత ఆర్ ఐ, వి ఆర్ ఓ ల ను ఆదేశించారు. వెంకప్పకోట, బసినికొండ,వలసపల్లి, నిమ్మనపల్లి మండలం రచవేట వారి పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ భూములను తహశీల్దార్లు, సర్వేయర్లు తో కలసి పరిశీలించారు. ప్రభుత్వ భూమితో పాటు డి.కే.టి భూములను పరిశీలించి వెంటనే రిపోర్టును అందజేయాలని సంబందిత ఆర్.ఐ సర్వేఎర్ లను ఆదేశించారు. అంతక ముందు వంద పడకలు ఉన్న జిల్లా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా చేయుటకు గాను అవసరమైన భూమిని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పక్కన రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న క్లాస్ 4, స్టాఫ్ నర్స్ క్వాటర్స్ పరిశీలించి ఎందుకు ఉపయోగించుకోలేదని సంబందిత సూపరిండేంట్ ను అడిగి తెలుసుకొన్నారు. క్వాటర్స్ పూర్తిగా మరమత్తులు కు గురి ఐ నందు వల్ల వినియోగించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలోమదనపల్లి, నిమ్మనపల్లి తాహసీల్దార్లు సురేష్ బాబు, కృష్ణమోహన్ డిప్యూటీ సర్వేఎర్ ముని కృష్ణయ్య, సర్వేఎర్ కృష్ణ మూర్తి, ఆర్.ఐ చాణుక్య వి.ఆర్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon