• Neti Charithra

మదనపల్లె లో ప్రతి ఇంటికి ఉచితంగా శుద్ధినీటి సరఫరా కుచర్యలు- ఎంపి మిథున్ రెడ్డి

#మదనపల్లె లో ప్రతి ఇంటికి ఉచితంగా శుద్ధినీటి సరఫరా కుచర్యలు- ఎంపి మిథున్ రెడ్డి

మదనపల్లె: నేటి చరిత్ర (అక్టోబరు 16 ) గండికోట రిజర్వాయర్ నుండి పైపులద్వారా చిత్తూరు జిల్లా మదనపల్లె కు త్రాగునీరు అందిస్తామని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు, అనపగుట్ట , 27 వ వార్డు చుక్కల తాండా,16 వ వార్డు బుగ్గకాల్వ , 11వ వడ్డిపల్లి వార్డు లందు స్థానిక ఎమ్మెల్యే యం. నవాజ్ బాష తో కలసి ఆర్ ఓ ( ఉచిత మంచి నీటి సరఫరా)ప్లాంట్ల ను పారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గండికోట రిజర్వాయర్ నుండి మదనపల్లె మున్సిపాలిటీ కి రాబోయే రెండు సంవత్సరాలలో త్రాగునీటి తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు. రోజుకు రూ.10 నుండి రూ.20 పెట్టి త్రాగునీరు కొంటున్నారని నెలకు రూ. 300 నుండి సంవత్సరానికి దాదాపు రూ.3 వేలు ఖర్చు పెట్టుతున్నారని తెలిపారు. నీటి కొనుక్కోవడం మీకు అదనపు భారం పడుతుందని.మీరు మున్సిపాలిటీ కి పన్ను చెల్లించే డబ్బుతోనే వార్డులోని ఆర్వో ఓ ప్లాంట్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఈ రోజు ఒక్కక్యాన్ చొప్పున నెలకు 30 క్యాన్ల అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలను వార్డు కు సంబంధించిన సమస్యల పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం గా తాగునీరు, రోడ్లు,డ్రైనేజీ, సిసిరోడ్లు, వంటి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలు సమావేశం లు నిర్వహించడానికి మాకు భవనం లేదని ఎంపీ దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, తహశీల్దార్ భూమి చూపించిన వెంటనే భవనం నిర్మాణం చెప్పటడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు నవాజ్ బాష మాట్లాడుతూ త్రాగునీరు కోసం మున్సిపాలిటీ లోని 35వార్డుల్లో 35 ఆర్ ఓ ప్లాంట్లు ను ఉచిత మంచి నీరు సరఫరా కోసం యం. పి నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు..మదనపల్లె మున్సిపాలిటీ లో ఉన్న 35 వార్డులో రోడ్లు,త్రాగునీరు, డ్రైనేజి,సిసి రోడ్లు నిర్మాణం చేప్పట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నక్కల దీన్నే తాండకు చెందిన ఈశ్వర్ నాయక్ ఆరోగ్యం సరిగలేదని తెలిసిన వెంటనే ఈశ్వర్ నాయక్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ని అడిగి,ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ యన్.రెడ్డెప్ప, సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, శిక్షణ కలెక్టర్ పృథ్వీ తేజ్,మున్సిపల్ కమిషనర్ కె. ఎల్.వర్మ, డీఈ మహేష్,తహశీల్దార్ సురేష్ బాబు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జి.వి.చలపతి, హస్మత్ జాన్ , ఎస్ ఏ కరిముల్లా, రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon