• Neti Charithra

మదనపల్లె లో ప్రజా సమస్యల పై దృష్టి పెట్టండి- స్పెషల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ జాహ్నవి..!


మదనపల్లె లో ప్రజా సమస్యల పై దృష్టి పెట్టండి- స్పెషల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ జాహ్నవి..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధి లో ప్రజా సమస్యల పరిష్కారానికి

ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ జాహ్నవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం నందు మదనపల్లె

మునిసిపాలిటీ ప్రత్యేక అధికారిణిగా

ఆమెబాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ప్రత్యేక అధికారిణిగా బాద్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మునిసిపాలిటి పరిధిలో త్రాగునీరు సరఫరా, పారిశుధ్య పనులు, వార్డు సచివాలయాల లో ఉద్యోగుల పనితీరు, వంటి వాటి పై జరుగుతున్న పనులను కమిషనర్ మరియు ఇతర సంబంధిత అధికారులతో సమీక్షించారు. పట్టణంలో త్రాగునీటి సమస్య, పారిశుద్యం, మార్కెట్లు సమస్యల నుండి ప్రజల ద్వారా ఎలాంటి పిర్యాదులు

లేకుండా ఎప్పటి కప్పుడు పరిశీలించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. మునిసిపాలిటీ కి సంబంధించి పత్రికలలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రత్యేక ధృష్టి పెట్టి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంతకుమునుపు ప్రత్యేక అధికారిణి గా మొదటి సారిగా మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ కి మునిసిపల్ కమిషనర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.


178 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon