• Neti Charithra

మదనపల్లె లో జరిగే రైతు చైతన్య యాత్రను విజయవంతం చేయండి- రైతు సంఘం పిలుపు..!


మదనపల్లె లో జరిగే రైతు చైతన్య యాత్రను విజయవంతం చేయండి- రైతు సంఘం పిలుపు..!బి కొత్తకోట: నేటి చరిత్ర


రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు మంగళం పాడేందుకే వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ తీసుకు వచ్చిందని ఎపీ రైతుసంఘం జిల్లాకార్యదర్శి పీ.యల్.నరసింహులు అన్నారు. శనివారం

చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో

కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న పీ.యల్.నరసింహులు

మాట్లాడుచూ;రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఒకసారి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులకు నెలవారి బిల్లు వడ్డన తప్పనిసరి అయిపోతుందన్నారు.నాటి ముఖ్యమంత్రి వైయస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం రద్దు అవ్వడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నాటి టిడిపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాల మేరకు విద్యుత్తు చార్జీలు అమాంతంగా పెంచితే ప్రజా ఆగ్రహానికి గురై ప్రభుత్వం ఓటమిపాలైందని, ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం నుంచి అధిక అప్పులు పొందేందుకు గుడ్డిగా తల ఊపి రైతుల నడ్డి విరిచే మీటర్లు ఏర్పాటుకు పూనుకున్నదని విమర్శించారు. రైతాంగం ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టి ఉద్యమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా బ్రష్టుపట్టించేందుకు ఒడిగట్టిందని, ఇప్పటికే అప్పుల పాలైన రైతాంగానికి మరింతగా నష్టం జరుగుతుందని, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే 3 వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మరింత చేటు చేయబోతున్నదని

వాపోయారు.రైతు వ్యవసాయ మార్కెట్ల రద్దుతో ఇకపై గిట్టుబాటు ధర దక్కదని, కార్పొరేట్ శక్తులతో కాంట్రాక్ట్ వ్యవసాయం జరగబోతున్నదని, ఇందువలన వ్యవసాయ రంగంపై కార్పొరేటు శక్తుల ఆధిపత్యం కొనసాగనున్న ఫలితంగా రైతులకు రక్షణ కొరవడుతుందని, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, నూనె గింజలు, నిత్యావసర వస్తువుల చట్టం రద్దు చేయడంతో అక్రమ నిల్వలతో ధరలు అమాంతం పెరిగి సామాన్యుడు కొనలేని స్థితి ఏర్పడుతుందని, కనుక ఈ మూడు బిల్లులు కార్పొరేటు అనుకూల రైతాంగ వ్యతిరేకమైనవి గా భావించి దేశవ్యాప్తంగా 400 రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయని, అలాగే మన రాష్ట్రంలో కూడాఉద్యమంప్రారంభమైందన్నారు.ఈనెల 15న ఒంగోలులో ప్రారంభమైన"రైతు యాత్ర"రాయలసీమలో ప్రవేశించి ఈనెల 18 వతేదీ ఆదివారం మదనపల్లి కి చేరుకుంటుందని, సాయంత్రం 6 గంటలకు మదనపల్లె లోని చిత్తూరు బస్టాండ్ నందు బహిరంగ సభ జరుగుతుందన్నారు.ఈ యొక్క బహిరంగ సభలో *రైతుసంఘాల జాతీయ,రాష్ట్ర నాయకులు వడ్డే.శోభనాద్రీశ్వర రావు,రావుల.వెంకయ్య,ఎర్నేని.నాగేంద్ర,వై.కేశవరావు,జెట్టి.గురునాధరావు* తదితరులు పాల్గొని ప్రసంగింస్తారని, రైతులందరూ ఈ యొక్క సభకు పెధ్ధ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.ఈకార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,మండల నాయకులు యస్.తంబయ్యశెట్టి,కె.శంకర,పీ. మంజునాథ్,శ్రీనివాసులు,పాపన్న తదితరులు పాల్గొన్నారు.


56 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon