• Neti Charithra

మదనపల్లె లో ఘనంగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..!



మదనపల్లె లో ఘనంగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..!




మదనపల్లె::నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో

అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మచెరువు మిట్ట వెలుగు ప్రత్యేక పాఠశాల వృద్ద్ధాశ్రమం లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లి కోర్టు రెండొవ అదనపు

ఇంచార్జ్ జిల్లా జడ్జి శ్రీ నరేష్ విచ్చేయగా వృధా మహిళలు పుష్ప గుచ్చాలతో

స్వాగతించారు . వృధాశ్రమంలోని శ్రీమతి సరోజమ్మ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభించడమైనది . కొంతమంది వృద్దులు పాటలు పాడారు . శ్రీమతి సరోజమ్మ నృతలతో అలంకరించారు. వెలుగు వృధాశ్రమం యొక్క కార్యకలాపాలు గూర్చి వివరించారు. అనంతరం జడ్జి శ్రీ నరేష్

మాట్లాడుతూ నేడు సమాజంలో కుటుంబ వ్యవస్థలు, వాటి బంధాలు క్షిణించిపోతున్నాయి అని ,పోషణ బాధ్యతను చూడవలసిన పిల్లలే తమ వృద్దులైన తల్లి దండ్రులను ఆశ్రమాల్లో చెరిపిస్తున్నారని అందువల్లనే నేడు సమాజంలో వృధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయని తెలిపారు.

పిల్లలు,వృద్దులు దేవుని స్వరూపాలని వీరిని ప్రేమతో ఆదరించాలని, సేవ చేయాలనీ తెలిపారు, ఇక్కడ ఉన్న వృద్దులకు సేవ చేస్తున్న యాజమాన్యం, సిబ్బంది గొప్ప మనస్సున్నవారని కొనియాడారు. వయస్సు పెరుగుతున్న కొద్ది ప్రతి ఒక్కరిలో మతిమరుపు, చాదస్థంలాంటివి ఉంటాయని, అంత మాత్రాన పెద్ద వారిని చిన్న చూపు చూడ కూడదని తెలిపారు.

ఇక్కడనున్న వృధులందరికి నేను తండ్రిలాంటి వాడినని, మీ యొక్క అవసరాలు అధికారిగా గాని, వ్యక్తిగతంగా , ఏమైనా తెలియజేస్తే నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు, అనంతరం వృధాశ్రమం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి గోపాలమ్మ గారిని శాలువాతో, పూలహారంతో సత్కరించి , మొమెంటో అందజేశారు.

అనంతరం వెలుగు సెక్రటరీ శ్రీ యం ఉదయ్ మోహన్ రెడ్డి , న్యాయమూర్తి

శ్రీ నరేష్ ను శాలువతో సత్కరించి, మోమొమెంటో అందజేశారు. అనంతరం వృద్దులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండొవ అదనపు జిల్లా జడ్జి శ్రీ నరేష్ , వెలుగు సెక్రటరీ శ్రీ యం ఉదయ్ మోహన్ రెడ్డి , వెలుగు వృధా మహిళలు , సిబ్బంది పాల్గొన్నారు.


108 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon