• Neti Charithra

మదనపల్లె లో కార్మిక సమస్యలు పై ఏఐటీయూసీ నిరసనలు..!


మదనపల్లె లో కార్మిక సమస్యలు పై ఏఐటీయూసీ నిరసనలు..!



మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూర్ జిల్లా మదనపల్లెలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎనిమిది గంటల పనివాదానం అమలు చేయాలని ఏఐటీయూసీ

నాయకులు ధర్నా నిర్వహించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చిన్న యల్లప్ప సహయ కార్యదర్శి సాంబశివ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణప్ప వేణుగోపాల్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముబారక్, డిమాండ్ చేశారు.

కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని అనంతరం ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడకొట్టారని,నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టసభల్లో కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. కరోనా సమయంలో పనిచేస్తున్న స్కీం వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించి,వారికి సేప్టీ కిట్లు ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో ఉపాధిలేక నష్టం పోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్

చేశారు..ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు తిరు,దనువాసులు లక్ష్మిదేవి, అలివేలమ్మ,గంగులప్ప రెడ్డప్ప,రవి సురేష్ కుమార్ రవి మాదవి,పృద్విరాజ్, నాగరాజు,మురళి,,హసీన,అయూబ్ తదితరులు పాల్గొన్నారు.


66 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon