• Neti Charithra

మదనపల్లె లో అభివృద్ధి కి మంజూరైన నిధులు వినియోగానికి ఎమ్మెల్యే కృషి చేయాలి- సీపీఎం


మదనపల్లె లో అభివృద్ధి కి మంజూరైన నిధులు వినియోగానికి ఎమ్మెల్యే కృషి చేయాలి- సీపీఎం



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా నిధులు పుష్కలంగా ఉన్నా కూడా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



14వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఆ నిధులతో మంజూరు అయిన పనులు టెండర్లు పూర్తి అయినా కూడా పనులు ప్రారంభించలేదని అన్నారు. 2015-16 సంవత్సరానికి 60 లక్షల రూపాయలతో 13 పనులు, 2016-17 సంవత్సరానికి కోటి రూపాయలతో 18 పనులను టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మదనపల్లె మున్సిపాలిటీ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.14వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కు వెల్లకుండా పనులు పూర్తి అయ్యేవిధంగా మదనపల్లె

శాసనసభ్యులు నవాజ్ బాష జోక్యం చేసుకోవాలని కోరారు. అధికార పార్టీ నాయకులే అధికారులను పనులు ప్రారంభించకుండా చేస్తున్నారనే అపవాదు రాకుండా చేయడంతో పాటు, మదనపల్లె పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.


105 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon