• Neti Charithra

మదనపల్లెమున్సిపల్ కార్మికులు కుసచివాలయల కు అప్ప జెప్పొద్దు- ఏఐటీయూసీ డిమాండ్!


మదనపల్లె

మున్సిపల్ కార్మికులు కుసచివాలయల కు అప్ప జెప్పొద్దు- ఏఐటీయూసీ డిమాండ్!




మదనపల్లె: నేటి చరిత్ర



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు అప్పచెప్పే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరుమించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.చిత్తూరు జిల్లా మదనపల్లె

ఏఐటీయూసీ కార్యాలయంలో మదనపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హజరైన రామచంద్రయ్య మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యాపితంగా మున్సిపాలిటీ,కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా జీతాలు చెల్లించడంలో ఆయా మున్సిపాలిటీలు నిర్లక్ష్యం

వహిస్తున్నారన్నారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ పేరుతో నెల నెలా జీతాలు సరిగ్గా చెల్లించడంలేదన్నారు. ఆయా మున్సిపాలిటీ,కార్పొరేషన్లలో పెండింగులో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులకు రిటైర్డ్ అయిన కార్మికులకు జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని,కార్మికులకు మున్సిపల్ కోటర్స్ ను కార్మికులకే సొంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహయ కార్యదర్శి సాంబశివ,మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముబారక్,సీపీఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి మురళి,మస్తాన్,పోతులప్ప,నారాయణ,నాగరాజు,పృద్విరాజ్,మదు,వాసు,ఉమ,తదితరులు పాల్గొన్నారు


94 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon