• Neti Charithra

మదనపల్లె మిట్స్ విద్యార్థికి అరుదైన అవార్డు..

#మదనపల్లె మిట్స్ విద్యార్థికి అరుదైన అవార్డు..

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్20) చిత్తూరు జిల్లా మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె (మిట్స్ ఇంజనీరింగ్) కళాశాలకు "బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్" అవార్డు ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్సు డెవలప్మెంట్ (MHRD) ఇన్నోవేషన్ సెల్ వారు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఢిల్లీ లోని ఇటీవల ఏ.ఐ.సి.టి.ఈ కార్యాలయం లో జరిగిన అవార్డు ల కార్యక్రమం లో కళాశాల కు ఈ అవార్డు ను అందించినట్లు, 2018-19 సంవత్సరంకు గాను సౌత్ సెంట్రల్ జోన్ లో మిట్స్ కళాశాలకు ఈ అవార్డు అందించినట్లు ఆయన అన్నారు. కళాశాలలోని ఇన్నోవేషన్ సెల్ ద్వారా ఇన్నోవేషన్ కౌన్సిల్ ను ఎర్పాటు చేసి విద్యార్థులు తో నూతన ఆలోచనలతో వివిధ కార్యక్రమాలను చేసినందుకు గాను ఈ అవార్డు ను అందజేశారు. మనదేశం లో 950 కళాశాలలకు ఈ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఉండగా, కేవలం 25 కళాశాలకు మాత్రమే ఈ అవార్డు లు అందాయని, అందులో మిత్స్ కళాశాల కు అందడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తమ విద్యార్థులు అనేక సాంకేతిక రంగాలలో నూతన పరిశోధనలు చేసి, ఇన్నోవేటివ్ ఐడియా ల ద్వారా ఎన్నో నూతన అంశాలను ప్రవేశ పెట్టినందుకు గాను విద్యార్థులకు కృతఙతలు తెలిపారు. ఈ అవార్స్డ్ ను గౌరవ భారత మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' చేతులమీద గా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జగదీశ్ బాబు అందుకున్నట్లు అన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon