• Neti Charithra

మదనపల్లె పాదయాత్రలో ఎమ్మెల్యే నవాజ్ బాషా కు ఘన స్వాగతం పలికినవైసీపీ నేతలు..!


మదనపల్లె పాదయాత్రలో ఎమ్మెల్యే నవాజ్ బాషా కు ఘన స్వాగతం పలికినవైసీపీ నేతలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా చేపట్టిన నాడు-నేడు పాదయాత్ర

కు మంగళవారం ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రెండవరోజు

పెంచుపాడు ,బొమ్మను చెరువు ,దండువారి పల్లి, రామాపురం, కొత్తపల్లి మీదుగా ఈశ్వరమ్మ కాలనీ, చిత్తూరు బస్టాండ్ వరకు పాదయాత్ర వైసీపీ శ్రేణుల కోలా హలం మధ్య కొనసాగింది.

పాదయాత్ర సందర్భంగా వైసీపీ నేతలు



( పాదయాత్ర లో ఎమ్మెల్యే నవాజ్ బాషా కు ఘనంగా సత్కరిస్తున్న నేతలు)


అంకి శెట్టిపల్లి మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి, J చంద్ర, బిసి సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి బిల్లే రెడ్డి ప్రసాద్, కొత్తపల్లి ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి తో పాటు మదనపల్లె 14 వ వార్డు ఇంచార్జ్ వైసీపీ

జిల్లా యూత్ సెక్రెటరీ ఎస్ ఏ కరిముల్లా,16 వ వార్డు రాజేష్ లు ఎమ్మెల్యే నవాజ్ బాషా కు ఘన స్వాగతం పలికి గజ మాల తో సత్కరించారు. కార్యక్రమాల్లో వైసీపీ నేతలు జింకా చలపతి, షమీమ్ అస్లాం, ఉదయ్ కుమార్,మెట్రో బాబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు.