• Neti Charithra

మదనపల్లె తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా !


మదనపల్లె తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా !




మదనపల్లె: నేటి చరిత్ర


కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీస్ వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య విభాగంలోని ఉద్యోగులు, స్కీమ్ వర్కర్ల కూడా ఈ సేవలను అందిస్తున్నారు వీళ్ళందరికీ పాలకులు అండగా నిలవాలని కోరుతూ గురువారం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయం ముందు, పట్టణంలోని వివిధ సచివాలయాల ముందు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రకటనలు చేస్తుంది కాని అందరికీ అందుబాటులో ఉండే విధంగా రక్షణ పరికరాలు అందజేయడంలో విఫలమైందన్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి కరోనా నివారణకు, కరోనా బాధిలకు సేవ చేస్తున్నటువంటి వారిని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లు అందరికీ 25000 రూపాయలను వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదాయపన్ను పరిధిలో లేని కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులు అందరికీ కూడా పదివేల రూపాయలను చెల్లించాలని చెల్లించాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వ తరహాలో నిత్యావసర వస్తువుల్ని బియ్యం పప్పు తో 17రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాలని కోరారు. ఉపాధిహామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత ఉపాధిని చూపిస్తోంది కుటుంబ సభ్యులు అందరూ పనులు చేయడం వలన వంద రోజులు తొందరగా పూర్తి అవుతున్నాయని, అందుకని ప్రతి ఒక్కరికి 100 రోజుల పని దినాలను గ్రామీణ ప్రాంతాల్లో చూపించాలని, ప్రతి కుటుంబానికి 250 రోజులకు తక్కువ కాకుండా చూపించాలని డిమాండ్ చేశారు.

ఉపాధిహామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.ప్రభాకర్ రెడ్డి, హరీంద్రనాథ్ శర్మ, సిఐటియు నాయకులు రాజేశ్వరి, మధురవాణి తదితరులు పాల్గొన్నారు.

169 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon