• Neti Charithra

మదనపల్లె జిల్లా సాధన కమిటీ చే నిరసన లు..!


మదనపల్లె జిల్లా సాధన కమిటీ చే నిరసన లు..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి లో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలో 32 జిల్లాలు ఉన్నట్లు, అందులో మదనపల్లె జిల్లాకు చోటు కల్పించినట్లు వస్తున్న వార్తలను తాము స్వాగతిస్తున్నామని, అయినా అధికారికంగా మదనపల్లె జిల్లా ప్రకటించేదాకా ఉద్యమం కొనసాగుతుందని, మదనపల్లె జిల్లా సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మదనపల్లె జిల్లా సాధన సమితి కో కన్వీనర్ కోనేటి దివాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు బి.శ్రీచందు,

కోనేటి దివాకర్ లు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధన కోసం ఏడాదిన్నర కాలంగా నిర్విరామంగా ఉద్యమం నిర్వహిస్తున్నామని, మదనపల్లె జిల్లా ఆవిర్భావం జరిగే దాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇప్పటిదాకా మదనపల్లె జిల్లా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన అన్ని సంఘాలు, రాజకీయ పక్షాలు, వ్యక్తులూ మరింత ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 16 (శ్రీబాగ్ ఒప్పంద దినం) నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమం ప్రజాస్వామ్య పద్దతిలో, శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. అన్ని సంఘాలు, రాజకీయ పక్షాలు, మీడియా, సోషల్ మీడియా స్వచ్చందంగా ఈ ఉద్యమంలోకి కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రతినిధులు ప్రకాష్, బాబ్జాన్, నాగరాజు, శేఖర్, హరీష్, అశోక్ లతోపాటు బాస్ నాయకులు ఆనంద్, రవిశంకర్, రెడ్డిప్రసాద్, శేఖర్ వీఆర్పీఎస్ నాయకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


127 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon