• Neti Charithra

మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా పాదయాత్ర కు నీరాజనం..పలికిన వైసీపీ శ్రేణులు..!


మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా

పాదయాత్ర కు నీరాజనం..పలికిన వైసీపీ శ్రేణులు..!




మదనపల్లె:నేటి చరిత్ర

(జనార్దన్)



చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా రామసముద్రం లో నాడు-నేడు పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. మొదట జనార్దన్ స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మదనపల్లె మండలం పనస మాను కుంట వరకు జరిగిన పాద యాత్రలో వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఎమ్మెల్యే నవాజ్ బాషా

కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యాంగ కర్త అంబెడ్కర్ విగ్రాహనికి నివాళులు అర్పించారు. పలు చోట్ల మహిళలు హారతులు ఇచ్చి పాదయాత్ర కు సంఘీభావం తెలిపోయారు. కార్యక్రమాల్లో రామసముద్రం, మదనపల్లె మండలానికి చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.


282 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon