• Neti Charithra

మదనపల్లె ఆలయాలు వద్ద నిరసనలు చేపట్టిన టీడీపీ నేతలు..!


మదనపల్లె ఆలయాలు వద్ద నిరసనలు చేపట్టిన టీడీపీ నేతలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో

టీడీపి నాయకులు శనివారం

నిరసన కార్యక్రమం చేపట్టారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత

రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, దాడులు పెరిగిపోయాయని, హిందు ఆలయాలకు తీవ్ర అపచారం జరుగుతోందని టిడిపి నాయకులు ఆర్.జే వెంకటేష్ విమర్శించారు. టిడిపి‌ ఆద్వర్యంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ధర్మపోరాటం కార్యక్రమాన్ని నిర్వహించారు.

దేశంలో ఎక్కడ లేని‌ విధంగా ఎపిలో హిందు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టిడిపి నాయకులు ప్రభాకర్ TNSF, RJ వెంకటేష్ విమర్శించారు. ప్రభుత్వ ఉదసిన వైఖరికి‌ నిరసనగా టీడీపీ నాయకులు సహజీవన్ బాబు,ప్రకాష్ నాయుడు, శ్రీనివాసులు, అఖిల్, అరుణ్,కత్తి అరుణ తదితరులు హజరై ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ధర్మపోరాటం చేశారు. ఈ సందర్భంగా ఆలయాలను పరిరక్షించుకుందాం, ఆచారాలను కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున

నినాదాలు చేశారు. వైసిపి అదికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలు అపచారాలు, దోపిడీలు పెరిగిపోయాయని, కుల, మతాల వారీగా ప్రజలను విడగొట్టి రాజకీయలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


81 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon