• Neti Charithra

భార్య నల్లగా ఉందని.. హత్య చేసిన భర్త.. భయం తో తాను ఆత్మహత్యాయత్నం..!


భార్య నల్లగా ఉందని.. హత్య చేసిన భర్త.. భయం తో తాను ఆత్మహత్యాయత్నం..!




హైదరాబాద్‌ : నేటి చరిత్ర


భార్య భర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, ఆప్యాయత. ఇవేగానీ లోపిస్తే లేనిపోని మనస్పర్థలు, గొడవలు జరుగుతుంటాయ్. తాజాగా హైదరాబాద్‌లో భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో దారుణం జరిగిపోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు మంచిగానే ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం ఉన్నఊరిని సైతం వదిలి ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మరీ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది..!?

పూర్తి వివరాల్లోకెళితే.. యోగి, అరుణ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.!. భార్య నల్లగా ఉందని కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితో కాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను వేధిస్తున్న యోగి ఇవాళ ఇలా దారుణానికి ఒడిగట్టాడు.

కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యోగి సొంతూరు అనంతపురం జిల్లా అని తెలియవచ్చింది. అయితే.. భార్య నల్లగా ఉందనే కారణంగానే హత్య చేశాడా..? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


170 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon