• Neti Charithra

భార్యను.. పేకాట లో.. పెట్టాడు... పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతి!

#భార్యను.. పేకాట లో.. పెట్టాడు... పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతి!

యుపి : నేటి చరిత్ర (సెప్టెంబర్22) ఉత్తర ప్రదేశ్ లో ని కల్యాణ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూదం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ నెల 15న తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి పేకాట మొదలెట్టాడు. చేతిలోని డబ్బంతా అయిపోయింది. ఆడడానికి సొత్తు కనిపించలేదు. చుట్టూ చూస్తే భార్య కనిపించింది. వెంటనే అతడి మదిలో చటుక్కున ఆలోచన మెరిసింది. వెంటనే భార్యను పందెం కాశాడు. ఆ ఆటలోనూ అతడు ఓటమి పాలయ్యాడు. ఇక, స్నేహితుడి భార్యను గెలుచుకున్న మిగతా ఫ్రెండ్స్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. స్నేహితుడి ముందే అతడి భార్యపై అత్యాచారానికి యత్నించారు. ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న భర్త వారి చెర నుంచి భార్యను రక్షించుకోలేకపోయాడు. అయితే, నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు మాత్రం ఇది భార్యభర్తల గొడవంటూ నిందితులను వదిలిపెట్టారు. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు మాత్రం తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది.

40 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon