• Neti Charithra

భారీగా రుణం.. ఇప్పిస్తామని.. వైసీపీ ఎమ్మెల్సీ కి రూ.50 వేలు డిమాండ్ చేసిన ఆగంతకుడు..!



భారీగా రుణం.. ఇప్పిస్తామని.. వైసీపీ ఎమ్మెల్సీ కి రూ.50 వేలు డిమాండ్ చేసిన ఆగంతకుడు..! నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నమోదు చేసిన ఘటన రాయచోటి లో చోటు చేసుకుంది.పోలీసులు కథనం మేరకు..

భారీ రుణం ఇప్పిస్తానంటూ ఎమ్మెల్సీ ఎం.జకియాఖానంకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి వ్యవహరించిన తీరుపై చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు రాయచోటి

పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ జి.రాజు మాట్లాడుతూ..  మంగళవారం రాత్రి తన పేరు బాబూ జగజ్జీవన్‌రావు

అని.. తాను సీఎం కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానని నమ్మబలికి ఎమ్మెల్సీకి ఫోన్‌ చేశారని చెప్పారన్నారు. ముందుగా రూ.50 వేలు నగదు డిపాజిట్‌

చేయాలని చెప్పడంతో అనుమానం వచ్చిన ఆమె వెంటనే చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆయన సీఎం కార్యాలయానికి ఫోన్‌ చేసి విషయంపై ఆరా తీసి అది అబద్ధమని నిర్ధరించుకొని ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.


270 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon