• Neti Charithra

భారీగా పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు.. చిత్తూరు జిల్లా లో రైతులకు భారీ నష్టం!


భారీగా పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు.. చిత్తూరు జిల్లా లో రైతులకు భారీ నష్టం!




చంద్రగిరి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా చంద్రగిరి శేషాచల అటవీ సమీప పంటపొలాలపై ఏనుగులగంపు

అర్ధరాత్రి దాడులు చేసాయి. ఈ సందర్భంగా

ఏ.రంగంపేట నాగపట్ల పరిధిలోని వరి, మామిడి పంటలు కు ఏనుగుల గుంపు నష్టం చేసినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు లక్షల పంట నష్టం కలిగినట్లు తెలుస్తోంది.

శనివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది . అటవీ అధికారులకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదని బాధిత రైతులు ఆరోపించారు. ప్రతి




(వరి పంటను ధ్వంసం చేసిన ఏనుగులు)

(మామిడి తోట కంచెను ధ్వంసం చేసిన ఏనుగులు)


(ఏనుగుల దాడి లో దెబ్బతిన్న పంట)


సంవత్సరం ఇదే విధంగా పంటను ఏనుగుల గుంపు నాశనం చేస్తున్నాయని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చింది లేదని ఉదయం వచ్చిన అటవీ అధికారులు చాలా హేళనగా మాట్లాడారు అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అటవీ అధికారులు పనితీరు సరిగ్గా లేదని పై అధికారులకు తెలుపుతామని మాకు న్యాయం జరగకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదని దయవుంచి ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.



130 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon