• Neti Charithra

భారీగా గంజాయి ని తరలిస్తున్న లారీ సీజ్!

#భారీగా గంజాయి ని తరలిస్తున్న లారీ సీజ్!

విజయనగరం: నేటి చరిత్ర (అక్టోబర్26) విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని లింగాలవలస జాతీయరహదారి పై లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు శనివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం రావడంతో... సిఐ సిహెచ్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ యు.మహేష్‌, సిబ్బంది మాటువేసి లారీని పట్టుకున్నారు. అక్కడ నుండి లారీని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గంజాయి సుమారు 4 వేల కేజీల వరకూ ఉంటుందని అంచనా వేశారు. లారీలో సుమారు 40 బస్తాల వరకూ పెద్దవి ఉన్నాయి. విడివిడిగా చిన్నప్యాక్‌ లు సుమారు. 100 వరకూ ఉంటాయి. గంజాయి మొత్తాన్ని లారీలోంచి కిందకు దింపి ఎన్ని బ్యాగ్‌లు, మొత్తం బరువు ఎంత, విలువల వివరాలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. పట్టుకున్న గంజాయి బస్తాలను స్ధానికుల సహకారంతో స్టేషన్‌ లో భద్రపరిచారు. కేసుకు సంబంధించి విచారణ ను పోలీసులు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon