• Neti Charithra

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు !


భారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు !



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట పోలీస్ లు కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ సునీల్ కుమార్ కథనం మేరకు.. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం తో స్థానిక పోలీసులు నిఘా

పెట్టారు. ఈ సందర్భంగా గట్టు గ్రామ పంచాయతీ నాయనబావి సమీపం లో నిఘా పెట్టిన పోలీసులకు అటుగా వస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లె కు చెందిన భానుప్రకాష్, తంగేవారిపల్లె కు చెందిన శంకర్ రెడ్డి, మొలకలవారిపల్లె కు చెందిన మధుకర్ రెడ్డి లను అరెస్ట్ చేసి వారి నుంచి 468


కర్ణాటక మద్యం ప్యాకెట్లు ను స్వాధీనం

చేసుకొని రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిబ్బంది నాగరాజు గౌడ్, లక్ష్మినారాయణ, నాగేంద్ర, వెంకటరమణ, రమణయ్య లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ కర్ణాటక నుంచి అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్లు తరలించి నా.. అక్రమ

అమ్మకాలు చేసే వారి పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.


912 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon