• Neti Charithra

భారత్‌లోని కోవిడ్‌ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన



భారతదేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చింది. అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లోని కోవిడ్‌ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో కోవిడ్‌ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు.


భారత్‌లో ఒక్కరోజే 2,812 కోవిడ్‌ మరణాలు..!

భారత్‌ లో ఒక్కరోజే 2,812 మంది కరోనా రోగులు మఅతి చెందారు. దీంతో మఅతుల సంఖ్య సుమారు 2 లక్షలకు చేరుకుంది. సోమవారం నాడు 352,991 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి !


చేయగలిగినంత సాయం చేస్తాం : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్‌ టెడ్రోస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్‌ టెడ్రోస్‌ మాట్లాడుతూ.. గత 9 వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. భారత్‌లో కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని హామీ ఇచ్చారు. అసలు పరిస్థితి ఊహించలేనంతగా ఉందని, ఇతర దేశాలకు లోగడ సాయం చేసిన భారత్‌ నేడిలా క్రైసిస్‌ ని ఎదుర్కోవడం ఆశ్చర్యకరమని అన్నారు. తాము ఆక్సిజన్‌ కాన్‌ సెంట్రేటర్లను, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ మొబైల్‌ ఫీల్డ్‌ హాస్పిటల్స్‌ ను, లేబోరేటరీని ఇండియాకు పంపుతామని టెడ్రోస్‌ తెలిపారు. పోలియో, టిబి సహా వివిధ కార్యక్రమాలకు ఉద్దేశించి పని చేస్తున్న 2,600 మంది నిపుణులను భారత్‌ లో అధికారులకు, వైద్య సిబ్బందికి సాయపడేందుకు పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియాను ఆదుకునేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయని, ఇది అభినందించదగినదని ప్రశంసించారు. మరిన్ని దేశాలు ఈ విషయంలో చొరవ చూపగలవని ఆశించారు.


భారత ప్రజలను ఆదుకోవడం మా విద్యుక్త ధర్మం : ఫ్రాన్స్‌

అటు అమెరికా, బ్రిటన్‌ దేశాలతోబాటు తాజాగా ఫ్రాన్స్‌ కూడా ఇండియాకు సాయపడేందుకు ముందుకు వచ్చింది. ఇండియా ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలను ఆదుకోవడం తమ విద్యుక్త ధర్మమని ఫ్రాన్స్‌ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ సాయమే కాకుండా భవిష్యత్తులో మరింత సాయం చేస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ దేశం నుంచి అత్యాధునిక ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఇండియాకు చేరనున్నాయి.