• Neti Charithra

భిక్షాటన చేస్తున్న ఆరేళ్ల పాప పై.. 50 ఏళ్ల వ్యక్తి.. అత్యాచారం..ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..!


భిక్షాటన చేస్తున్న ఆరేళ్ల పాప పై.. 50 ఏళ్ల వ్యక్తి.. అత్యాచారం..ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..!



గుంటూరు: నేటి చరిత్ర


ఆరేళ్ళ చిన్నారి పై..50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఈ ఘటన జరిగింది. మేడికొండూరు సీఐ ఆనందరావు విలేకర్ల

సమావేశంలో వివరాలు వెల్లడించారు. భిక్షాటన చేసుకుంటూ జీవించే కుటుంబానికి చెందిన చిన్నారి మంగళవారం పేరేచర్ల జంక్షన్‌కు వచ్చింది. రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరేచర్ల జంక్షన్‌లోని సీసీకెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని అపహరించి తీసుకెళ్లినట్లు గుర్తించారు. చుట్టు పక్కల వెతుకుతుండగా.. రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ కనిపించింది. నిందితుడిని

గుంటూరు రూరల్‌ నల్లపాడుకు చెందిన స్వామిగా బుధవారం సాయంత్రం గుర్తించారు. పాపకు మాయమాటలు చెప్పి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. స్వామిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


356 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon