• Neti Charithra

బిరుట్ లో భారీ పేలుడు.. 50 మంది మృతి.. వందలాది మందికి గాయాలు..!


బిరుట్ లో భారీ పేలుడు.. 50 మంది మృతి.. వందలాది మందికి గాయాలు..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిది)



లెబనాన్‌ రాజధాని బీరుట్‌ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

మంగళవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల దాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోగా 2,750 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల

కింద అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు అనంతరం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. సమీపంలోని భవంతికీ మంటలు విస్తరించడంతో తీవ్రత మరింత పెరిగింది. అనేక భవంతుల్లో కిటికీలు, ఇళ్లలో అలంకరణ కోసం ఏర్పాటు చేసుకున్న పైకప్పులు తునాతునకలైపోయాయి. ఎక్కడ చూసినా భవనాల శిథిలాలు,

దెబ్బతిన్న వాహనాల భాగాలు కనిపిస్తున్నాయి. బీరుట్‌ ఓడరేవు కేంద్రంగా చోటు చేసుకున్న ఈ ఘటన.. కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాలపైనా ప్రభావం చూపింది. పెద్దఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.


217 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon