• Neti Charithra

బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య !!

#బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య !

తెనాలి: నేటి చరిత్ర (అక్టోబర్1) గుంటూరు జిల్లా తెనాలిలో అంకిరెడ్డి(38) అనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన అంకిరెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఆయన తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు నెలల క్రితమే అంకిరెడ్డి తెనాలి బ్రాంచ్‌లో చేరాడు. ఆయన మృతిపై కుటుంబీకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. బ్యాంక్ ఆర్ఎం వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అంకిరెడ్డి భార్య చెబుతోంది. భార్య, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అంకిరెడ్డి తండ్రి పేర్కొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon