• Neti Charithra

బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో యాజమాన్యం!

#బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో యాజమాన్యం!

ముంబై: నేటి చరిత్ర (అక్టోబర్1) ప్రతి సారి ఆరంభంలోనే కొత్త ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో సంస్థ పండగల వేళ మరో కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ప్రస్తుతం రూ.1500గా ఉన్న జియో ఫోన్‌ను దసరా, దీపావళి పండగల సందర్భంగా రూ.699 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. నిబంధనలేవీ లేకుండా ఈ ప్రత్యేక ధరతో రూ.800 ఆదా చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 2జీ మొబైల్స్‌తో పోల్చుకుంటే ఈ జియో ఫోన్‌ ధర చాలా తక్కువ. దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలిపింది. దేశంలో 35కోట్ల 2జీ వినియోగదారులు ఉండగా వారిని 4జీ దిశగా మళ్లించి అందరికీ డిజిటల్‌ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొంది. ఈ ఆఫర్‌ ద్వారా జియోలో చేరిన వారికి రూ.700 విలువైన డేటా ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది. తొలి ఏడు రీఛార్జిలు చేసుకునే వినియోగదారులకు అదనంగా రూ.99ల డేటా అందించనుంది. ఫోన్‌పై రూ.800తో పాటు డేటాపై రూ.700 వరకు మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చని తెలిపింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon