• Neti Charithra

బాధ్య తలు చేపట్టిన మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్న తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి!

తిరుమల: నేటి చరిత్ర (ఫిబ్రవరి8)

తిరుపతి అర్బన్ ఎస్పీ గా ఆవుల రమేష్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. తిరుమల లో ఆయన బాధ్య తలు చేపట్టిన మొదటి రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

తన జీతంలో సగం నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికే కేటాయిస్తున్నట్లు తిరుపతి అర్బన్‌ జిల్లా నూతన ఎస్పీ ఆవుల రమేష్‌ రెడ్డి ప్రకటించారు. శనివారం ఉదయం ఆవుల రమేష్‌ రెడ్డి నూతన అర్బన్‌ ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ ఆవుల రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ... ఉత్తమ కథనానికిగాను ప్రతి నెలా ఓ జర్నలిస్ట్‌ కు 5000 రూపాయలు అందచేస్తానన్నారు. 13 ఏళ్ల తర్వాత సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. మరింత మంది సివిల్‌ సర్వీస్‌ కు ఎంపిక కావాల్సి ఉందన్నారు. ప్రతి వారం ఓ పాఠశాలను సందర్శిస్తానని అన్నారు. తన జీతంలో 50 శాతం పిల్లల విద్య ప్రోత్సాహకానికి కేటాయిస్తానని నూతన ఎస్పీ ఆవుల రమేష్‌ రెడ్డి ప్రకటించారు.

118 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon